బీహార్‌లోని బగాహా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు ప్రమాదానికి గురైంది. బగాహ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. రాజస్థాన్‌లోని ఆర్మీ బెటాలియన్‌ను బెంగాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. రైలులో సైనిక సిబ్బందితో పాటు వారి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రైలులోని మూడు బోగీలు బగాహా వద్ద రైల్వే ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. దీంతో.. గోరఖ్‌పూర్-నర్కటియాగంజ్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి.
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బీహార్‌లో శాసన మండలి ఎన్నికల్లో ఓటింగ్ జరగకుండానే మొత్తం 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో 11 స్థానాలు ఖాళీ కాగా.. ఇందులో, ఎన్డీఏకు చెందిన ఆరుగురు అభ్యర్థులు, మహాకూటమికి చెందిన ఐదుగురు అభ్యర్థులు మినహా.. 12వ పోటీదారు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Bihar: బీహార్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లిని వీడియో తీసేందుకు వచ్చిన వ్యక్తి ఏకంగా పెళ్లి కొడుకు చెల్లిని లేపుకుపోయాడు. ప్రస్తుతం ఈ వార్త ఆ రాష్ట్రంలో తెగవైరల్ అవుతోంది. ముజఫర్ నగర్లో ఓ పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు వచ్చిన యువకుడు వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఈ ఘటన అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు అన్నీ పూర్తయిన తర్వాత బాలిక పారిపోయింది.
Amit Shah: కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేశారని, పేదల కోసం ఏం చేసింది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆరోపించారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన ఓబీసీ మోర్చా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పేదలకు మేలు చేసింద కేవలం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ మాత్రమే అని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో రెండోసారి అడుగు పెట్టనున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం పశ్చిమ చంపారన్ జిల్లా ప్రధాన కార్యాలయం బెట్టియా పట్టణాన్ని సందర్శించి రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
Lalu Prasad Yadav: బీహార్ పాట్నా వేదికగా ఈ రోజు రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హిందువు కాదని అన్నారు.