Tejashwi Yadav: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితిష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకడం ఆ రాష్ట్రం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలకు దీనిపై విమర్శలు సంధిస్తున్నాయి. నితీష్ కుమార్, ప్రధాని మోడీ పాదాలను తాకడం సిగ్గుచేటని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ రోజు బీహార్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం నితీష్, ప్రధాని మోడీ వేదికను పంచుకున్న సమయంలో ఈ చిత్రం కనిపించింది. ఈ చిత్రాన్ని చూసి తాను సిగ్గుపడ్డానని తేజస్వీ యాదవ్ అన్నారు.
Read Also: Off The Record: కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేతలు.. పార్టీ ఖాళీ అవుతుందా..?
‘‘ఈరోజు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకిన ఫొటో చూశాను… మాకు సిగ్గుగా అనిపించింది.. ఆయనకు ఏమైంది? నితీశ్ కుమార్ మా కాపలాదారు.. నితీశ్ అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మరొకరు లేరు. ఆయన ప్రధాని మోదీ పాదాలను తాకుతున్నారు’’ అని అన్నారు. ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో నితీష్ కుమార్, ప్రధాని మోడీకి వేదికపై ఉన్న ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నితీష్ ప్రధాని కాళ్లను తాకుతున్నట్లుగా ఉంది.
ఇదిలా ఉంటే, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 4000 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ముందుగా నాలుగువేల కన్నా ఎక్కువ సీట్లు ఎన్డీయే గెలుస్తుందని చెప్పి, ఆ తర్వాత తప్పును సరిదిద్దుకని 400 సీట్లు గెలుస్తుందని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.