దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారుల తీరుపై ఈసీ కొరడా ఝుళిపించింది.
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోతీహరిలో భార్య, ముగ్గురు పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త ఇద్దుమియాన్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. వారిని హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడు. అయితే.. నిందితుడు ఇద్దును పట్టుకున్న వారికి మోతిహరి పోలీసులు రూ. 15,000 రివార్డు ప్రకటించారు. అందుకోసం నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు.
తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా తన ముగ్గురు ఆడపిల్లలను అతికిరాతకంగా చంపేశాడు. ఆ వ్యక్తి ఇదివరకే ఓ కూతుర్ని చంపి జైలు నుంచి బయటకు వచ్చాడు. బీహార్ రాష్ట్రంలోని చంపారం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఇదు మియాన్, అతని భార్య అఫ్రీన్ ఖాతున్. వీరిద్దరికీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వారు అర్బున్ ఖాతున్ (15), షబ్రున్ ఖాతున్ (12), షెహ్బాజ్ ఖతున్ (9).…
పురాతన కాలంలో ప్రజలు భూమిలోపల గుహలు తయారు చేసుకుని ఆశ్రయం పొందేవారు. ఇప్పుడున్న రోజుల్లో అలాంటి గుహలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే బీహార్లో ఇలాంటి గుహలను అక్కడి జనాలు చూశారు. ఈ గుహలో వెతకగా ప్రజలు ఆశ్చర్యపోయారు. అందులో భారీగా మద్యం ఉండటాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇండియా కూటమిలో మరో చీలిక వచ్చేటట్టు కనిపిస్తోంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క ఇంకా తేలలేదు. కానీ సంకీర్ణ ధర్మాన్ని మాత్రం రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది.
సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ నటి, మోడల్ నేహాశర్మ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం మహాకూటమిలో సీట్లపై పోరు కొనసాగుతున్న తరుణంలో బీహార్లోని భాగల్పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ తన వాదన వినిపించారు.
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాలూకు మొత్తం ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మిసా భారతి, రోహిణి ఆచార్యలను ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్లో ఒక్కసారిగా బలహీన పడ్డ కాంగ్రెస్.. ప్రస్తుతం అనూహ్యంగా కొత్త జోష్ వచ్చింది. ప్రాంతీయ పార్టీ అయిన జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది.
Loksabha Elections 2024 : 2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల నుంచి 102 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.