Google Maps: గూగుల్ మ్యాప్ మరోసారి రాంగ్ రూట్ చూపించి మరో కుటుంబాన్ని మోసం చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్ తల్లి తప్పిదంతో ముగ్గురు మరణించగా.. ఈసారి ఓ కుటుంబాన్ని ఏకంగా అడవుల పాలు చేసేసింది.
Pappu Yadav: బీహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపించాడు. తనకు సెక్యూరిటీ పెంచాలని బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరాడు.
Suman Kumar: 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపిఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేయడంతో బీహార్ లోని సమస్తిపూర్ నగరం వెలుగులోకి రాగా.. ఇప్పుడు అదే నగరానికి చెందిన సుమన్ కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీయడమే కాకుండా.. ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి చారిత్రక ఘనత సాధించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 టోర్నమెంట్లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుమార్ బీహార్ తరఫున ఆడుతూ…
Bihar: బీహార్ ముజఫర్‌పూర్‌లో జరిగిన వివాహ ఊరేగింపుకు హాజరైన నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వీరంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వరుడి తరుపున వచ్చిన వారంతా మద్యం సేవించి, ఊరేగింపులో నాగిన్ డ్యాన్సులు చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు.
Prashant Kishor: అమెరికాలోని బీహారీ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బీహార్ నిజంగానే విఫల రాష్ట్రం.. దీని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
బీహార్ రాష్ట్రం నలందలోని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌గిర్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో ఏఎస్ఐ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసు కుమారుడు మహిళల హాకీ మ్యాచ్ చూడాలనుకున్నా చూడలేకపోయాడని సమాచారం. ఈ ఘటన బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం ‘పుష్ప’ మొదటి భాగంలో అందరూ చూశారు.
Womens Asian Champions Trophy: బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ 3-0తో జపాన్ను ఓడించి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అత్యధికంగా 15 పాయింట్లతో ఒలింపిక్ రజత పతక విజేత చైనా (12) కంటే ముందుంది. మంగళవారం జరిగే సెమీస్‌లో భారత్ నాలుగో ర్యాంకర్ జపాన్‌తో తలపడుతుంది. అలాగే చివరి నాలుగో రెండో మ్యాచ్‌లో…
‘పుష్ప-2: ది రూల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న జనాలకు రేపు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ చిత్ర నిర్మాతలు ఇటీవల చిత్ర ట్రైలర్‌ను ముంబైలో లేదా హైదరాబాద్ లేదా ఢిల్లీలో విడుదల చేయడం లేదని బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్టు చెప్పడంతో…