బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన వెలుగు చూసింది. ఒక మగ ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్‌లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్ని్కలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని స్థాపించారు. ‘జన సూరజ్’ పేరుతో పార్టీ స్థాపించారు.
బీహార్‌లోని అర్వాల్లో ఓ నిర్మాణ సంస్థపై దాడి జరిగింది. గురువారం అర్థరాత్రి మఖమిల్పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన రోడ్డు నిర్మాణ సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కొంతమంది పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని రోడ్డు రోలర్, రెండు జేసీబీలు, రెండు హైవేలు, రెండు ట్రాక్టర్లతో కూడిన ట్యాంకర్లను తగులబెట్టారు.
Monkeys Fighting: కోతులు కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలని నిలిపేశాయి. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రెండు కోతులు మధ్య గొడవ జరగడంతో దాదాపుగా గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
Bihar: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. ఈ విషయమై తాజాగా రాష్ట్ర రాజధాని పట్నా నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన తెలిపిన స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Google Maps: గూగుల్ మ్యాప్ మరోసారి రాంగ్ రూట్ చూపించి మరో కుటుంబాన్ని మోసం చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్ తల్లి తప్పిదంతో ముగ్గురు మరణించగా.. ఈసారి ఓ కుటుంబాన్ని ఏకంగా అడవుల పాలు చేసేసింది.
Pappu Yadav: బీహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపించాడు. తనకు సెక్యూరిటీ పెంచాలని బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరాడు.
Suman Kumar: 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపిఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేయడంతో బీహార్ లోని సమస్తిపూర్ నగరం వెలుగులోకి రాగా.. ఇప్పుడు అదే నగరానికి చెందిన సుమన్ కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీయడమే కాకుండా.. ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి చారిత్రక ఘనత సాధించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 టోర్నమెంట్లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుమార్ బీహార్ తరఫున ఆడుతూ…
Bihar: బీహార్ ముజఫర్‌పూర్‌లో జరిగిన వివాహ ఊరేగింపుకు హాజరైన నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వీరంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వరుడి తరుపున వచ్చిన వారంతా మద్యం సేవించి, ఊరేగింపులో నాగిన్ డ్యాన్సులు చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు.