రాచకొండ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదులో తుపాకులు విక్రయించేందుకు ఈ ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా? అని ఆరా తీస్తున్నారు. ముఠా…
Big Scam: ‘‘పిల్లలు లేని మహిళల్ని గర్భవతిగా చేయడం.’’ ఇదే ఓ ముఠా నినాదం. బీహార్‌కి చెందిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్‌డివిజన్‌లోని కహురా గ్రామంలో ఈ స్కామ్ జరిగింది. సైబర్ స్కామర్లు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ని నడిపారు. దీని ద్వారా వారు కస్టమర్లను ఆకర్షించి, వారిని బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. యూపీ, బీహార్ నుంచి ఢిల్లీ వరకు భూమి కంపించింది. భూకంప కేంద్రం నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్‌లో దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సోమవారం ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. దహను తాలూకాలో తెల్లవారుజామున 4.35 గంటలకు భూకంపం సంభవించిందని జిల్లా డిజాస్టర్…
జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పట్నాలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉండటంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
Bihar: ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి నితీష్ కుమార్ సారథ్యం జేడీయూ-బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ పార్టీలు కలిసి అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాయి. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా కూటమిలో తిరిగి చేరేందుకు నితీష్ కుమార్‌కి తలుపులు తెరిచే ఉన్నాయి’’ అని అన్నారు.
Minister Ratnesh Sada: బీహార్ రాష్ట్రం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి రత్నేష్ సదా ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆటో ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా బల్లియా సిమర్ అనే తన స్వగ్రామానికి చేరుకున్న మంత్రి రత్నేష్ సదా, ఉదయం వాకింగ్‌కు గార్డుతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న టెంపో అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…
Priyanka Gandhi: పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని పేర్కొనింది.
BPSC Exam Row: బీహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరగడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులతో పాటు మరో 700 మంది నిరసనకారులపై కేసు ఫైల్ చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్.. నలుగురు చేతుల్లో బందీగా ఉన్నారని ఆరోపించారు.