Bihar: ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి నితీష్ కుమార్ సారథ్యం జేడీయూ-బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ పార్టీలు కలిసి అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాయి. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా కూటమిలో తిరిగి చేరేందుకు నితీష్ కుమార్‌కి తలుపులు తెరిచే ఉన్నాయి’’ అని అన్నారు.
Read Also: Anna University Case: లైంగిక వేధింపుల కేసుని రాజకీయం చేస్తున్నారు.. హైకోర్ట్ ఫైర్..
ఈ వ్యాఖ్యలపై నితీష్ కుమార్‌ని ప్రశ్నించిన సమయంలో.. ‘‘నవ్వుతూ.. “క్యా బోల్ రహే హై (ఏం చెప్తున్నారు?)’’ ఒకింత కరుగుగా బదులిచ్చారు. ఎన్డీయే కూటమిలో ఉన్న నితీష్ కుమార్ గగంళో రెండుసార్లు ప్లేటు ఫిరాయించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ‘‘మహాఘట్ బంధన్’’ ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, కొన్ని రోజులకే ఆయన మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా నితీష్ కుమార్ ఉన్నారు.
ఇదిలా ఉంటే, కొత్త ఏడాదిలో బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం పడిపోతుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమార్ సన్నిహిత సలహాదారు చేతిలో బందీగా ఉన్నారని, బీహార్‌ని స్వతంత్రంగా నిడిపించే సామర్థ్యం ఆయనకు లేదని ఆరోపించారు. లాలూ వ్యాఖ్యల్ని జేడీయూ నేత, కేంద్రమంత్రి లాలన్ సింగ్ తోసిపుట్చారు. బీజేపీ, జేడీయూ కూటమిగా ఉన్నాయని, ఇది స్వేచ్ఛా దేశమని ప్రజలు ఏదంటే అది చెప్పవచ్చని లాలూ వ్యాఖ్యల్ని తేలికగా కొట్టిపారేశారు.