బీహార్‌లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం దందా, అక్రమ మద్యం రవాణా పెరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు.
Train Incident: బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి, కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న DMU రైలు చక్రానికి ఓ ఇనుప రాడ్ చిక్కుకోవడంతో ఘటన జరిగింది. అయితే, లోకో పైలట్ చాకచక్యంతో రైలు ఆగిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన తర్వాత స్థానిక రాణిపాత్ర స్టేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రైల్వే అధికారులతో పాటు GRP ఫోర్స్ రావడంతో రాడ్…
ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు.
బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
Bihar: భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులు ఇటీవల కాలంలో పట్టుబడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌కి చెందిన మరో వ్యక్తిని బీహార్ గయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. బాబు జో బారువా అలియాస్ రాజీవ్ దత్తాగా పేరు మార్చుకున్న వ్యక్తి గత 8 ఏళ్లుగా ఇండియాలో బౌద్ధ సస్యాసిగా నటిస్తూ అక్రమంగా నివసిస్తున్నాడు.
బీహార్‌లో దారుణం జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లాలో విద్యార్థుల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్‌లోని పుర్నియా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది తెప్పపై వెళ్తున్నారు. హఠాత్తుగా అది అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది.
Bihar Spurious Liquor News: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టిస్తోంది. బిహార్‌లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. సివాన్ జిల్లాలోనే ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సివాన్ ఎస్పీ అమితేష్ కుమార్ తెలిపారు. మరో 10-15 మందికి పాట్నాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సారణ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు…
Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ,…
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.