Giriraj Singh: బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌లకు ‘‘భారతరత్న’’ ఇవ్వాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం అన్నారు. రాష్ట్రాభివృద్ధికి నితీశ్ కుమార్ కృషి చేశారని.. నవీన్ పట్నాయక్ కూడా ఒడిశాకు ఏళ్ల తరబడి సేవలందించారని, అలాంటి వారిని భారతరత్న వంటి అవార్డులతో సత్కరించాలని గిరిరాజ్ సింగ్ విలేకరులతో అన్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
Read Also: Team India: టీమిండియా బ్యాటర్లకు షాక్.. దెబ్బకు పడిపోయారుగా..!
‘‘బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుంది. నితీష్ కుమార్ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముప్పై ఏళ్లు నిండిన నేటి పిల్లలు లాలూ జీ జంగిల్ రాజ్‌ను చూడలేదు’’ అని ఆయన అన్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, జెడి(యు) నేత రాజీవ్ రంజన్ సింగ్ మంగళవారం తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే మంచి ఫలితాలను సాధించింది. బీజేపీతో జేడీయూ, ఎల్జేపీ-రామ్ విలాస్, హిందూస్తానీ అవామ్ మోర్చా(సెక్యులర్)లు కలిసి బీహార్‌లో పోటీ చేశాయి. బీహార్‌లో ఎన్డీయే కూటమిలో బీజేపీ సీనియర్ భాగస్వామిగా ఉంది. బీజేపీకి 84 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జేడీయూకి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి 2025 చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.