Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(పీకే)తో శుక్రవారం భేటీ అయ్యారు. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతిసింగ్ ఇటీవల తన భర్తపై ఆరోపణలు చేసింది. పవన్ సింగ్‌పై ఇటీవల జ్యోతిసింగ్ వివాహేతర సంబందాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పీకేను కలవడం…
Tej Pratap Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని…
Bihar: కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కీలక పోరు నెలకొంది. అయితే, ఇప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల కన్నా బీహార్ ప్రజలు లాలూ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మరో కొడుకు తేజస్వీ యాదవ్‌తో పొసగ
Election Commission: బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈసమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది, ఆచరిస్తుందని స్పష్టం చేశారు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని, ఓటు చోరీ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల సంఘానికి అధికార, విపక్ష పార్టీలు సమానమని అన్నారు. READ MORE: Rahul Gandhi: కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీలో లక్షకు పైగా…
Rahul Gandhi Bihar Yatra: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు బీహార్‌లో ‘ఓటర్ అధికార యాత్ర’ను ప్రారంభించారు. బీహార్‌లోని ససారాం ప్రారంభమైన యాత్రలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర దాదాపు 16 రోజుల పాటు రాష్ట్రంలోని 25 జిల్లాలు కవర్ చేస్తూ కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని…
Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎన్డీయేలోని మిత్రపక్షాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల, బీహార్ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించిన సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా, అంబులెన్స్‌లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం…
Bihar : కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ,…