Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(పీకే)తో శుక్రవారం భేటీ అయ్యారు. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతిసింగ్ ఇటీవల తన భర్తపై ఆరోపణలు చేసింది. పవన్ సింగ్‌పై ఇటీవల జ్యోతిసింగ్ వివాహేతర సంబందాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పీకేను కలవడం ఆ రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ జ్యోతి సింగ్, పవన్ సింగ్‌లు ఇద్దరూ ఎన్నికల్లో పోటీ గురించి గొడవపడుతున్నారు. తన భార్య తనకు ఎన్నికల టికెట్ ఇవ్వాలని తనపై ఒత్తిడి తెస్తోందని పవన్ సింగ్ ఆరోపించారు. అయితే, తాను కావాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పవన్ సింగ్ పోటీతో తనకు సంబంధం లేదని చెప్పింది. గత ఎన్నికల్లో తాను పవన్ సింగ్ గెలుపుకు పనిచేశానని, అది ప్రజలకు కూడా తెలుసని ఆమె మంగళవారం అఅన్నారు.
Read Also: Varinder Singh Ghuman: సల్మాన్ ఖాన్ సహనటుడు, ప్రముఖ వెజిటేరియన్ బాడీబిల్డర్ మృతి.. కారణం ఏంటంటే?
దీనికి ముందు పవన్ సింగ్ ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేశారు. ‘‘నా జీవితంలో నాకు ఒకే ఒక విషయం తెలుసు, ప్రజలే నాకు దేవుళ్లు. నేను ప్రజల మనోభావాలను దెబ్బతీయను. జ్యోతి సింగ్ నిన్న ఉదయం మీరు నా సొసైటీకి వచ్చినప్పుడు, నేను మిమ్మల్ని గౌరవంగా నా ఇంటికి ఆహ్వానించాను . మనం దాదాపు 1:30 గంటలు మాట్లాడుకున్నాము అనేది నిజం కాదా?’’ అని ప్రశ్నించారు.
గత ఏడాది తన వివాదాస్పద ప్రవర్తనతో బీజేపీ నుంచి పవన్ సింగ్‌ను తొలగించారు. బీహార్ ఎన్నికలకు ముందు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాలతో వరస సమావేశాలు జరిపిన తర్వాత తిరిగి బీజేపీలోకి వచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అర్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ సింగ్ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.