బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏర్పాటు చేయనున్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామాను సమర్పించడంతో పాటు బీజేపీతో పొత్తును కూడా రద్దు చేసుకున్నారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మధ్యంతర ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 43 సీట్లకు తగ్గారని.. వచ్చేసారి సున్నా గెలుస్తారని విమర్శించారు. నితీష్‌కు విశ్వసనీయత సున్నా అంటూ విమర్శలు గుప్పించారు.
Bihar Political Crisis: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్ ఫాగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బిహార్ గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన తర్వాత ఎన్‌డీఏ నుండి వైదొలగాలని ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని నితీష్ కుమార్ వెల్లడించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీయేకు గుడ్‌బై చెప్పాలని నితీశ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా…
బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలిసి, రాజీనామా లేఖ అందిస్తారని తెలిసింది. మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జేడీయూ అధిష్ఠానం పాట్నాలో నిర్వహించిన సమావేశం కీలక చర్చలకు వేదికైనట్లు తెలిసింది.
Bihar Politics: బీహర్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. బీజేపీ పార్టీని కాదని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతున్నారు నితీష్ కుమార్. దీంతో బీజేపీ కూడా అతివేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీహార్ రాజకీయంలో స్పీకర్ కీలకంగా మారాడు. దీంట్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆదివారం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా…
Bihar Politics: బీజేపీతో జేడీయూ దాదాపుగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఈరోజు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు నితీష్ కుమార్. బీజేపీ కూటమితో ప్రభుత్వంలో ఉండటం తన మనుగడకే ముప్పు వాటిల్లుతోందని.. జేడీయూ అభిప్రాయపడుతోంది. దీంతో పాటు ఇటీవల ఆర్సీపీ సింగ్ వ్యవహారం కూడా జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. చేస్తూ.. చేస్తూ..నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే జేడీయూ అదిరిపోయే వార్త చెబుతానంటూ నితీష్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం.…
Bihar Politics: బీహార్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతుందా.. అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీని బీజేపీ చీల్చేందుకు ప్రయత్నిస్తుందంటూ జేడీయూ అభద్రతా భావానికి గురవుతోంది. దీంతో బీహార్ లో సంయుక్తంగా అధికారంలో ఉన్న బీజేపీ-జేడీయూ పార్టీ బంధానికి బీటలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లుగానే…