Asaduddin Owaisi: బీహార్ ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరు నేతలు ప్రచారాన్ని తీవ్రం చేశారు. తాజాగా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్, ఓవైసీని ‘‘ఉగ్రవాది’’గా పిలవడం కొత్త వివాదానికి కారణమైంది. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. ‘‘బాబు ఉగ్రవాది(extremist)ని ఇంగ్లీషులో రాయగలరా..?’’ అంటూ సెటైర్లు వేశారు.
PM Modi:ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్‌లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒక నాయకుడు తూటాకు బలైన ఘటన గురువారం పాట్నా జిల్లాలోని మోకామా తాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. జన్సురాజ్ అభ్యర్థి పియూష్ ప్రియదర్శి మద్దతుదారుడు ఆర్జేడీ మాజీ నాయకుడు దులార్‌చంద్ యాదవ్ గురువారం రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పుల్లో కాల్చి చంపబడ్డాడు. దులార్‌చంద్ యాదవ్ పియూష్ ప్రియదర్శికి మద్దతుగా తన మద్దతుదారులతో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన…
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఓట్ల కోసం ఏదైనా చేస్తారని ఆరోపించారు. ‘‘ మీ ఓట్ల కోసం నరేంద్రమోడీని డ్యాన్స్ చేయమని అడిగితే, అతను వేదికపైనే డ్యాన్స్ చేస్తారు’’ అని ముజఫర్‌పూర్ లో తేజస్వీ యాదవ్‌తో కలిసి ఉమ్మడి ర్యాలీలో రాహుల్ గాంధీ అన్నారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమి, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమిలు ప్రచారాలు మొదలుపెట్టాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే కూటమి భావిస్తుంటే, దశాబ్ధానికి పైగా అధికారానికి దూరంగా ఉన్న ఆర్జేడీ గెలుపు రుచి చూడాలని అనుకుంటోంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6న ,నవంబర్ 11న రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది.
Bihar Elections: బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయితో లవ్‌లో ఉన్నానని ప్రకటించిన తర్వాత తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన జనశక్తి జనతాదళ్ (JJD) పార్టీని పెట్టారు.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు
Story of Satish Prasad Singh: బీహార్ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే.. జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు.…
Bihar Elections 2025: బీహార్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. తాజాగా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ నితీష్ కుమార్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. పలువురు విలేకరులు పప్పు యాదవ్‌తో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ.. కచ్చితంగా కాదని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ నితీష్‌ను గౌరవించదని ఆయన బదులిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ ఆయనను గౌరవిస్తుందా అని అడిగినప్పుడు, పప్పు యాదవ్ స్పందించి…