Tej Pratap Yadav: ఆర్జేడీకి భారీ షాక్.. లాలూ కుమారుడి కొత్త పార్టీ..
- బీహార్ ఎన్నికల ముందు సంచలనం..
- కొత్త పార్టీ పెట్టిన లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్..
- ఆర్జేడీ నుంచి బహిష్కరణ తర్వాత కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tej Pratap Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
Read Also: India Russia: ‘‘యుద్ధంపై మోడీ, పుతిన్ చర్చించారు..’’ నాటో చీఫ్ వ్యాఖ్యలను తిరస్కరించిన భారత్..
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
పార్టీ పోస్టర్‌పై మహత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, రారామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. దానిపై “సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, మార్పు ” అనే నినాదాలు ఉన్నాయి. పార్టీని ప్రకటించిన తర్వాత, తేజ్ ప్రతాప్ యాదవ్ సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేశారు. తాము బీహార్ పూర్తి అభివృద్ధి కోసం, కొత్త వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బీహార్ అభివృద్ధి కోసం సుదీర్ఘ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను ఎన్నికల్లో వైశాలి జిల్లా మహువా స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
మే 25న తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ పార్టీ నుంచి బహిష్కరిస్తూ తండ్రి లాలూ నిర్ణయం తీసుకున్నారు. అనుష్క అనే మహిళతో సంబంధం ఉందని తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. దీని తర్వాత తన సోషల్ మీడియా పేజీ హ్యక్ అయిందని చెప్పాడు. అయినప్పటికీ, కొడుకు బాధ్యతరహితంగా ప్రవర్తించాడనే కారణంగా లాలూ అతడిని పార్టీ నుంచి తొలగించారు.
हमलोग बिहार के संपूर्ण विकास के लिए पूर्ण रूप से समर्पित और तत्पर हैं। हमारा मकसद बिहार में संपूर्ण बदलाव कर एक नई व्यवस्था का नव निर्माण करना है।
हमलोग बिहार के संपूर्ण विकास के लिए लंबी लड़ाई लड़ने को तैयार हैं।#tejpratapyadav #janshaktijantadal #biharelection pic.twitter.com/GxsQHw0WqQ
— Tej Pratap Yadav (@TejYadav14) September 25, 2025
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!