Lalu Family Trouble: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.
Bihar: బీహార్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత, నితీష్ కుమార్ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవికి షాక్ ఇచ్చింది.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రికార్డ్ స్థాయిలో ఆయన 10వ సారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం తర్వాత, కొత్త ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరింది. పాట్నా గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రలు అమిత్ షా హాజరయ్యారు.
Nitish Kumar: దేశంలో నితీష్ కుమార్ రికార్డ్ సృష్టించబోతున్నారు. 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నేతలు హాజరుకాబోతున్నారు.
Bihar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం, పాట్నాలో జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్‌ను తమ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన పేరును బీజేపీ నేత, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సామ్రాట్ చౌదరి ప్రతిపాదించారు.
Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కేంద్రానికి, కేంద్ర హోం మంత్రికి అరుదైన అభ్యర్థన చేశారు. తన తల్లిదండ్రులు మానసిక వేధింపులకు గురయ్యారా అని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించాలని కేంద్రాన్ని, బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ ఎన్నికల ముందు జనశక్తి జనతాదళ్ అనే పార్టీని పెట్టి, మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Bihar Politics: బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన, సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, చివరకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మా
Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే లాలూ కూతురు, గతంలో లాలూకు కిడ్నీ దానంగా ఇచ్చిన రోహిణి ఆచార్య సంచలన ఆరోపణలు చేస్తూ.. తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించింది. తనపై చెప్పులతో తేజస్వీ యాదవ్ దాడి చేసినట్లు వెల్లడించింది. తనకు జరిగిన అవమానం గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో దుమారానికి కారణమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లు సాధిస్తే, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆర్జేడీ కేవలం 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారని అంతా భావించిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో ఒక్క సీటులో కూడా ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించలేదు. ఎన్డీయే సునామీలో ఆర్జేడీ లాగే ప్రశాంత్ కిషోర్(పీకే) కొట్టుకుపోయారు. అయితే, పరాజయంపై తొలిసారిగా స్పందించిన పీకే పార్టీ, ఎన్డీయేపై సంచలన ఆరోపణలు చేసింది. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు…