Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేడు నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక
- జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం
- కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవ ఎన్నిక
- నేడు మోడీ సమక్షంలో నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికయ్యారు. జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కింది. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత ఆయనకే దక్కింది. ఈరోజు ఉదయం నితిన్ నబిన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో కమల దళపతిగా నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, జాతీయ ఆఫీస్ బేరర్లు సహా ఇతర సీనియర్ నాయకులు హాజరవుతారు.
నితిన్ నబిన్..
నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్‌కు తొలి పరీక్ష కానుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇది కూడా చదవండి: MM Keeravani: ఢిల్లీ కవాతులో కీరవాణి మ్యాజిక్.. 2500 మంది కళాకారులతో మెగా షో..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!