బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది.
బీహార్‌లో ప్రస్తుతం ఓట్ల పండుగ జరుగుతోంది. తాజాగా ఓట్ల పండుగతో పాటు తరతరాలుగా ఆచారంగా వస్తున్న ఛత్ ఫెస్టివల్ కూడా వచ్చేసింది. దీంతో రాష్ట్రమంతటా సందడి.. సందడి వాతావరణం.. కోలాహలం కనిపిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఛత్ పండుగ జరగనుంది.
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.
బీహార్‌లో విపక్ష కూటమి మళ్లీ కలవబోతుందా? మునుపటి స్నేహమే కొనసాగించబోతున్నారా? ఎన్నికల ముందు మాస్టర్ ప్లాన్ వేశారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవే సంకేతాలు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఏకతాటిపై ఉన్న కూటమి.. సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో చివరి నిమిషంలో ఎవరికి వారే వేరైపోయారు.
మహిళలు, యువతుల పట్ల వేధింపులు ఆగడం లేదు. ఆఫీసుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనలతో రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తను మనిషి అన్న సంగతి మరిచాడు. కూతురు వయసున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కనే కూర్చుని బాలికపై చేయి వేసి అసభ్యంగా తాకుతూ మృగంలా ప్రవర్తించాడు. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు…
నిన్నామొన్నటి దాకా ఓటర్ యాత్ర పేరుతో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి బీహార్ అంతటా తిరిగాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కలలు కన్నాయి. కానీ చివరికి అంతా తుస్ మనిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.. ఓ వైపు నామినేషన్లు వేస్తున్నారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(పీకే)తో శుక్రవారం భేటీ అయ్యారు. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతిసింగ్ ఇటీవల తన భర్తపై ఆరోపణలు చేసింది. పవన్ సింగ్‌పై ఇటీవల జ్యోతిసింగ్ వివాహేతర సంబందాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పీకేను కలవడం…
ఆమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంది. పది మందిని సన్మార్గంలో నడిపించాల్సిన పండితులమ్మ బుద్ధిహీనురాలిలా ప్రవర్తించింది. టికెట్ తీసుకుని రైల్లో ప్రయాణించాల్సిన ఆమె.. దర్జాగా ఏసీ కోచ్‌లో కూర్చుని జర్నీ చేస్తోంది. టికెట్ చూపించమన్న పాపానికి టిక్కెట్ కలెక్టర్ వేధిస్తున్నాడంటూ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Story Board: మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ కూటమికీ పూర్తి సంతోషాన్నివ్వలేదు. సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం బీజేపీకి షాకిస్తే.. అనుకున్నట్టుగా ఫలితం రాకపోవడం కాంగ్రెస్‌నూ నిరాశపరిచింది. ఇలాంటి స్థితిలో ఆ తర్వాత జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. మోడీ మ్యాజిక్ తగ్గలేదని బీజేపీ సింహనాదం చేసింది. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఓట్ల చోరీకి సాక్ష్యాలు చూపించడంతో.. కాంగ్రెస్ ఓ పద్ధతి ప్రకారం…