Shocking Love Story: ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేకపోతున్నాము. ఇలాంటి ఒక ఘటనే తాజాగా బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జనవరి 16న ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు అకస్మాత్తుగా ఇళ్ల నుంచి కనిపించకుండా పోయారు. దీనితో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే డెల్హా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.
ఈ కేసును ఎస్‌ఎస్‌పీ సుశీల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో బాలికలు బక్సర్‌లో ఉన్నట్టు సమాచారం లభించింది. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులకు బాలికలు అప్పటికే ఢిల్లీ చేరుకున్నట్టు తెలిసింది. దీంతో వారి పరిస్థితి గమనించిన పోలీసులు ఆ ప్రత్యేక బృందాన్ని విమానంలో ఢిల్లీకి పంపించారు. అయితే ఢిల్లీ చేరుకున్న అనంతరం పోలీసులకు ఆశ్చర్యకర విషయం బయటపడింది.
పారిపోయిన నలుగురు బాలికల్లో ఇద్దరు అబ్బాయిలుగా మారి జీవిస్తున్నట్టు గుర్తించారు పోలిసులు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం.. నలుగురూ ఒకే స్కూల్‌లో చదువుతూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని, ఒకరిని ఒకరు విడిచి ఉండలేని పరిస్థితికి చేరుకున్నామని వారు పోలీసులకు తెలిపారు. ఇదే కారణంతో ఇంట్లో చెప్పకుండా కలిసి జీవించాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి పారిపోయినట్టు వెల్లడించారు.
IND vs NZ T20: వన్డే సిరీస్ ఎలాగో పోయింది.. టీ20 సిరీస్ అయినా..? నేటి నుంచి టీ20 సిరీస్ షురూ..!
ఈ ఘటనపై డీఎస్పీ ధర్మేంద్ర భారతి స్పందిస్తూ.. నలుగురు బాలికలను సురక్షితంగా గుర్తించి గయాకు తీసుకొచ్చామని తెలిపారు. వారి వాంగ్మూలాలను కోర్టులో నమోదు చేయనున్నట్టు తెలిపారు. బాలికల భద్రత విషయంలో కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశామని, కేసుకు సంబంధించిన చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.