ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులపై ఆందోళనలు పెట్టుబడిదారులను భయపెట్టడంతో గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల మధ్య అంతటా నష్టాలను చూసాయి. నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ 1,028.61 పాయింట్లు (1.80 శాతం) క్షీణించి 55,983.13 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 307.50 పాయింట్లు (1.81 శాతం) తగ్గి 16,677.70 వద్దకు చేరుకుంది.…
మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీలో హేతుబద్దత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5-12 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు…
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని రవాణా, సమాచార శాఖ బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం హాట్ టాపిక్‌గా మారాయి. టికెట్ల ధరలు పెంచడం కుదరదని ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టింది. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు వర్తిస్తాయని…
తమిళనాడులోని కూనూరు వద్ద ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టన్ కుప్పకూలింది. ప్రమాదం సమయంలో సీడీయస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణీతో పాటు మరో 7గురు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్ర కేబినేట్ ఎమర్జెన్సీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ ఘటనపై ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఈ ప్రమాదంపై రాజ్‌నాథ్ సింగ్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా…
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో మంగళవారం మధ్యాహ్నం ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. పొలంలో కాలిపోయిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో అర్థరాత్రి ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ (54) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలో వరి చెత్తకు నిప్పంటించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కంటిచూపు సమస్య ఉన్న లక్ష్మణ్ గౌడ్ మంటలను గమనించలేకపోయాడు. అతడిని రక్షించేందుకు చుట్టుపక్కల…
ప్రముఖ పారిశ్రామికవేత్తలను మోసం చేసి వారి వద్ద నుంచి 200 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడిన సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయంతో తెలిసింది. అయితే బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లకు సుఖేశ్ చంద్రశేఖర్ కోట్లు విలువైన చేసే బహుమతులు ఇచ్చినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. జాక్వెలిన్‌కు రూ.52 లక్షలు విలువ చేసే గుర్రంతో పాటు రూ. 9లక్షలు విలువ చేసే పిల్లినే కాకుండా మొత్తంగా రూ.10 కోట్ల విలువైన బహుమతులు సుఖేశ్…
కరోనా మహమ్మరి ప్రపంచాన్ని వదలనంటోంది. గత సంవత్సరంలో జనవరి 30న కరోనా కేసు కేరళలో నమోదైంది. అయితే అప్పటి నుంచి భారత్‌ను వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కునేందుకు శాస్త్రవేత్తలు శ్రమించి కోవిడ్ టీకాలను కనుగోన్నారు. దీంతో ఇప్పుడిప్పుడే కరోనా రక్కసి ప్రభావం ఇండియాపై తగ్గుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కరోనా వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చి 10 రోజులే అవుతున్నా దీని వ్యాప్తి మాత్రం కరోనా డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు అధికంగా…
ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కోర్టు భారీ జరిమానా విధించింది. బ్రసెల్స్‌లో ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గూగుల్‌కు రూ.20,285 కోట్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చట్టవిరుద్దంగా ఇతర కంపెనీలకు మెరిట్‌లపై పోటీపడే అవకాశాన్ని, కొత్త ఆవిష్కరణలను నిరాకరించిందని, ముఖ్యంగా ఇది యూరోపియన్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపుతుందని ఈయూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ కంపెనీకి…
ఆఫ్రికా దేశంలోని సియర్రా లియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 91 మంది మృతి చెందగా 100 మంది గాయాలయ్యాయి. సియర్రా లియోన్‌లోని ఫ్రీటౌన్‌లో ఓ లారీని చమురు ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనాలను అక్కడే ఉంచారు. చమురు ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవుతుండడంతో చమురు కోసం స్థానిక జనాలు ఎగబడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చమురు ట్యాంకర్‌లో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. దీంతో 91 మంది మంటల్లో చిక్కుకొని…
తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి…