బండి సంజయ్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉంది : సంజయ్ తరపు న్యాయవాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల అంశంపై కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు రాగా బండి సంజయ్‌ను కార్యకర్తలు కార్యాలయంలోకి పంపి తాళం వేశారు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు.
అయితే ఈ రోజు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టులో బండి సంజయ్‌ను హజరుపరిచారు పోలీసులు. ఈ క్రమంలో బండి సంజయ్‌కు 14 రోజులు రిమాండ్‌ను కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు విధించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ తరుపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు గాయపడ్డారు ఎవరు గాయపర్చింది డిటైల్స్ సరిగా లేవని, 353 కాకుండా 333 కింద నోటిస్ ఇవ్వకుండా కోర్టుకు తీసుకువచ్చారని ఆయన అన్నారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
కావాలనే సెషన్స్ కోర్టు కాకుండా ఎక్సైజ్ కోర్టుకు తీసుకు వచ్చారని, లోపల ఉన్నోళ్లు బయట ఉన్నోళ్లను ఎలా కొడతారని ఆయన అన్నారు. బండి ఎవరిని కొట్టారో ఎటువంటి రుజువు లేదని, మేము కోర్టులో కేసును రిజక్ట్ చేయాలని కోరామన్నారు. జైలులో విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని తెలపడం జరిగిందని ఆయన వెల్లడించారు. పోలీసులు కావాలని నోటీసులు ఇవ్వకుండా కేసు పెట్టారని, ఇది ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని ఆయన ఆరోపించారు. రేపు హైకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ వేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఒక వ్యక్తి మీద ఓకే సమయంలో నేరం ఉంటే ఓకే కేసు పెట్టాల్సి ఉంది కాని ఇక్కడ రెండు కేసులు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!