ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని కేసీఆర్ ఆదేశించారు.
నేడు కేసీఆర్ వైద్యాశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు వైద్యశాఖ ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా రసూల్ పుర -2, ఎల్.బి.నగర్-1, శేర్ లింగంపల్లి-1, కుత్బుల్లాపూర్-1, కూకట్ పల్లి-1, ఉప్పల్-1, మల్కాజిగిరి-1, జల్ పల్లి-1, మీర్ పేట-1, పిర్జాదీగూడ-1, బోడుప్పల్-1, జవహర్ నగర్-1, నిజాంపేట్ -1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.
అలాగే హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా జగిత్యాల – 1, సూర్యాపేట – 1, సిద్ధిపేట – 1, మహబూబ్ నగర్-2, నల్గొండ-2, మిర్యాలగూడ-1, రామగుండం-2, ఖమ్మం-2, నిజామాబాద్-3, కరీంనగర్-2, కొత్తగూడెం-1, పాల్వంచ-1, నిర్మల్-1, మంచిర్యాల-1, తాండూర్-1, వికారాబాద్-1, బోధన్-1, ఆర్మూర్-1, కామారెడ్డి-1, సంగారెడ్డి-1, జహీరాబాద్-1, గద్వాల్-1, వనపర్తి-1, సిరిసిల్ల-1, తెల్లాపూర్-1, బొల్లారం-1, అమీన్ పూర్-1, గజ్వేల్-1, మెదక్-1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు.