పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ టాక్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “భీమ్లా నాయక్”ను చూసి రివ్యూ షేర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందు నిలచింది. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.36.37 కోట్లు వసూలు చేసి విజయశంఖం పూరించింది. ఒక్క అమెరికాలోనే మొదటి రోజు మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీలో రూ.7.05 కోట్లు. ఇక ఇతర రాష్ట్రాలు, పరదేశాల్లో కలిపి రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. అంటే తెలుగు రాష్ట్రాలలో కాకుండానే మొత్తం రూ.9.95 కోట్లు కొల్లగొట్టింది.…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్‌ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటు చేసిన సీఎం…
ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు. అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే అని నిరూపించారు. సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు. అహంభావానికి,…
పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది. ‘అఖండ’ తర్వాత టాలీవుడ్ లో కొత్త జోష్ వచ్చింది ఈ సినిమాతో. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల దర్శకనిర్మాతల మోముపై చిరునవ్వులు చిందేలా చేసింది. వారే పవన్ తో ‘హరిహరవీరమల్లు’ చిత్రం తీస్తున్న నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్. ‘భవదీయుడు భగత్ సింగ్’ నిర్మిస్తున్న మైత్రీమూవీస్, దర్శకుడు…
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం కనపరుస్తున్న తీరు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రంలో పేదవాడికి ఉన్న ఏకైక వినోదం సినిమా.. ఆ సినిమా పరిశ్రమను కూడా వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా ముఖ్యమంత్రి గారూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. సినిమాకు కూడా కులగజ్జి అంటించి తమాషా చూస్తున్నారని…
ఈరోజు హైదరాబాద్ లో “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ జరిగింది. అయితే సినిమా చిత్రీకరణ సమయం నుంచి నిన్న మూవీ రిలీజ్ అయ్యే వరకు త్రివిక్రమ్ దర్శకుడు సాగర్ కే చంద్రకు ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్ చైర్ లో కూర్చున్నారని, అంతా ఆయన చేతిలోనే ఉందని రూమర్స్ వచ్చాయి. పైగా త్రివిక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అసలు మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాజాగా జరిగిన “భీమ్లా నాయక్”…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంయుక్త మీనన్, నిత్యామీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అందించగా, తమన్ సంగీతం సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ‘భీమ్లా నాయక్’కు ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా మేకర్స్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.…
ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘భీమ్లా నాయక్’ మేనియా కొనసాగుతోంది. అయితే తాజాగా తమన్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో థియేటర్ లో ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రదర్శితం అవుతుండగా, తమన్ స్టేజి పై ఎక్కి ‘లాలా…