ఇప్పుడు టాలీవుడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. అయితే ఏపీలో మాత్రం ఇంకా థియేటర్లు, టికెట్ రేట్లపై వివాదం నడుస్తూనే ఉంది. అయితే “భీమ్లా నాయక్” విడుదలకు ముందే సవరించిన టిక్కెట్ ధర GOను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని అంతా భావించారు. ఏపీ ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అక్కడ టిక్కెట్ ధరలు తక్కువగా ఉండడంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. నిన్న ‘భీమ్లా నాయక్’…
విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీకి మొదటి ఆట నుండే ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ కె చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ ఎ. ఎస్. ప్రకాశ్, చిత్ర నాయిక సంయుక్త మీనన్…
పవన్ సినిమా కోసం చంద్రబాబు లోకేష్ లు పిల్లిమొగ్గలు వేస్తున్నారని, సినిమాని కూడా తండ్రీ కొడుకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సినిమాని తొక్కడం ఏంటో మాకు అర్ధం కావడం లేదని, చట్టం అమలు అవుతుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి..? ఆయన ప్రశ్నించారు. జీవో 35 పై ప్రతీ సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హై కోర్టు…
సీఎం వైఎస్ జగన్ ను సినిమా నటుడు పోసాని కృష్ణ మురళి గురువారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో సీఎం, ఆయన సతీమణి మాట సాయం చేశారని, ఏఐజి ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్జతలు తెలిపానని ఆయన వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల పెంపు పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చిన్న…
ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్లతో థియేటర్లను నిర్వహించలేమంటూ కొంతమంది ఎగ్జిబిటర్స్ వాటిని మూసివేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాను సైతం వారు ప్రదర్శించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అయితే… ఈ విషయంలో గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందనే వాదన వినిపిస్తోంది. ‘అత్యధిక రేట్లకు టిక్కెట్స్ ను అమ్ముకోనిస్తేనే థియేటర్లను నడుపుతాం తప్పితే, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు నడపమని ఎగ్జిబిటర్లు చెబుతున్నట్టే దీనిని అర్థం చేసుకోవాలని కొందరంటున్నారు. నిజం చెప్పాలంటే ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాను…
హీరోయిన్ పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించగా, త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. థియేటర్లలో అభిమానులు చేస్తున్న రచ్చకు…
ఏపీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. తమ హీరో సినిమా చూద్దామని వెళ్తుంటే థియేటర్లు మూసి ఉండటం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. టిక్కెట్ రేట్లపై కొత్త జీవో రాకపోవడంతో జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ముఖ్యంగా సి, డి సెంటర్లలో థియేటర్ల యజమానులు లబోదిబోమంటున్నారు. రూ.20, రూ.15, రూ.5 రేట్లకు తాము టిక్కెట్లను విక్రయించి నష్టపోలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో…
‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీకి త్రివిక్రమ్ కంట్రిబ్యూషన్ ఏమిటనేది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోతే ‘భీమ్లా నాయక్’ మూవీనే లేదని దర్శకుడు సాగర్ కె చంద్ర తెలిపాడు. మాటల రచయిత నుండి దర్శకుడిగా మారినా త్రివిక్రమ్ కలం పదను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది ‘భీమ్లానాయక్’ మూవీ. అంతేకాదు… స్క్రీన్ ప్లే విషయంలోనూ త్రివిక్రమ్ సత్తాను ఇంకోసారి చాటింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ…