పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంయుక్త మీనన్, నిత్యామీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అందించగా, తమన్ సంగీతం సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ‘భీమ్లా నాయక్’కు ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా మేకర్స్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, సాగర్ చంద్ర, సంయుక్త మీనన్, తమన్, గణేష్ మాస్టర్, నాగవంశీ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు హాజరయ్యారు.
Read Also : Chinmayi : రజినీ, కమల్ లపై కామెంట్స్… ముఖ్యమంత్రులనూ వదల్లేదుగా…!!
ఈ కార్యక్రమంలో తమన్ మాట్లాడుతూ సినిమాకు పిల్లర్ అని అంటున్నారు. పిల్లర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే సిమెంట్ అవసరం. ఆ సిమెంట్ త్రివిక్రమ్ గారు… ఆయన మాకు గట్టి సపోర్ట్ ను ఇచ్చారు. ఇక సినిమాలో మ్యూజిక్ ను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళం వాళ్ళు సినిమాలో అసలు సాంగ్ ఎలా చేస్తున్నారు ? అని అడిగారు. వాళ్లకు ఈ సినిమా పెద్ద ఆన్సర్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన ఇంకా ఏమేం మాట్లాడారో ఈ వీడియోలో వీక్షించండి.