ఈరోజు హైదరాబాద్ లో “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ జరిగింది. అయితే సినిమా చిత్రీకరణ సమయం నుంచి నిన్న మూవీ రిలీజ్ అయ్యే వరకు త్రివిక్రమ్ దర్శకుడు సాగర్ కే చంద్రకు ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్ చైర్ లో కూర్చున్నారని, అంతా ఆయన చేతిలోనే ఉందని రూమర్స్ వచ్చాయి. పైగా త్రివిక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అసలు మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాజాగా జరిగిన “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ లో త్రివిక్రమ్ పై డైరెక్టర్ సాగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : Bheemla Nayak Success Press Meet : మలయాళం వాళ్ళకి పెద్ద ఆన్సర్ ఇది… తమన్ కామెంట్స్
డైరెక్టర్ సాగర్ చంద్ర మాట్లాడుతూ ముందుగా చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తూ… సినిమాకి బ్యాక్ బోన్ త్రివిక్రమ్. సెట్ లో అంతమందిని కో ఆర్డినేట్ చేయడానికి, స్పిరిట్ ఇవ్వడానికి ఒక పర్సన్ కావాలి. అంటే హారానికి దారం లాంటివారు త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేశారు. ఆయన త్రివిక్రమ్ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ ను ఈ కింది వీడియోలో వీక్షించండి.