పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు రాజకీయాల కోసం సినిమాలను వదిలేసిన పవన్.. మూడేళ్ళ తరువాత మనసు మార్చుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఎక్కువగా రీమేక్ లపై మనసుపెట్టడం అభిమానులకు నచ్చడంలేదట.. మొదటి నుంచి పవన్ రీమేక్ లపైనే కన్నేస్తూ వచ్చాడు. అదునులో కొన్ని హిట్ ని అందుకున్నాయి.. మరికొన్న డిజాస్టర్లుగా నిలిచిపోయాయి. ఇక రీ ఎంట్రీలో పవన్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.. ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. శివరాత్రికి సాలిడ్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఆరోరోజు కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. నైజాం లో అయితే భీమ్లా నాయక్ మంచి రన్ నే హోల్డ్ చేసాడని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా…
‘భీమ్లా నాయక్’ సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉంది. డానియల్ శేఖర్ అకా రానా దగ్గుబాటికి జోడిగా నటించిన సంయుక్త పాత్రకు అంత ప్రాముఖ్యత ఏం లేదు. అయినప్పటికీ ఆమె తనకున్న స్పేస్ లోనే తన నటనతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. అయితే ఈ సినిమా స్క్రీన్ టైమ్ విషయంలో సంయుక్త నిరాశకు గురైందని వార్తలు వచ్చాయి. ఆమె…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అదే జోష్ తో ఆయన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం సమ్మర్‌లో సెట్స్ పైకి రానుంది అనే విషయాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమా పూర్తవ్వడం, హిట్ అవ్వడంతో…
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే తాను చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్ మీద బేస్ చేసి తీసిన…
ఫిబ్రవరి నెలలో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీని నూరు శాతానికి పెంచారు. వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలనూ తొలగించారు. దాంతో పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ తమిళ చిత్రం ‘వలిమై’, అలియాభట్ హిందీ మూవీ ‘గంగూబాయ్ కఠియావాడి’ వంటివి పలు భాషల్లో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది . తెలుగు సినిమాల విషయానికి వస్తే… ఫిబ్రవరి మాసంలో అనువాదాలతో కలిపి ఏకంగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఇటీవల రిలీజ్ అయ్యి విజయవంతమైన విషయం తెలిసిందే. భారీగా కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల కాలంలో ప్రతి సినిమాలోనూ కొన్ని సన్నివేశాల వలన కొందరి మనోభావాలను దెబ్బతీశారని కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా భీమ్లా నాయక్ లో కుమ్మరి కులస్థులను అవమానించారని తెలుపుతూ ఏపీ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే స్టైలిష్ లుక్ ఫోటోషూట్ తో వర్క్ కి కూడా సిద్ధమని తెలిపాడు. ప్రస్తుతం కథలను వింటున్న తేజు.. రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఇకపోతే దేవుడు గురించి, టైమ్ గురించి ఇటీవల నాన్ స్టాప్ గా ట్వీట్స్ వేస్తున్న ఈ హీరో తాజగా మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. ” గాడ్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర తన అనుభవాలను సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఇది మలయాళ రీమేక్ అయినా ఈ మూవీని చూసి వారే మళ్ళీ దీనిని రీమేక్ చేసేలా తాము మార్పులు, చేర్పులూ చేశామన్నారు. పవన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాని స్పాన్ పెరిగిందని, అలాంటి సమయంలో త్రివిక్రమ్ గారు ఇచ్చిన సజెషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. రచయితగా, దర్శకుడిగా ఆయన…
భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేస్తున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. టిక్కెట్ రేట్లు కావాలనే పెంచకపోవడం, అదనపు షోలకు అనుమతులు ఇవ్వకపోవడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇలా పలువురు నేతలు పవన్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. జగన్ హీరోగా సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన…