Pawan Kalyan: స్టార్ హీరోయిన్’ను రాజకీయాల్లోకి రమ్మన్న పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తూనే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మరోపక్క గతంలో ఒప్పుకున్న సినిమాలను కూడా ఆయన పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ఒక స్టార్ హీరోయిన్‌కి రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చినట్లుగా సదరు హీరోయిన్ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు, తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతానికి బాలీవుడ్ సహా తమిళ సినీ పరిశ్రమలో పలు సినిమాలు చేస్తూ వస్తున్న రాశీ ఖన్నా.
Also Read:Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఆమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె, పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్వీట్ మూమెంట్స్ పంచుకుంటూనే, పవన్ కళ్యాణ్ తనకు రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతుండగా.. ఆయన “మీరు సినిమాల్లోకి రావాలని అనుకున్నారా? లేక నటనలోకి రాకముందు వేరే ఏమైనా అవ్వాలనుకున్నారా?” అని ప్రశ్నించగా, దానికి ఆమె తాను ఐఏఎస్ అవ్వాలని అనుకున్నానని, కానీ అది కుదరక ఇలా సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే పవన్ “అయితే ఐఏఎస్ అవ్వడం కుదరని పక్షంలో రాజకీయాల్లోకి రావచ్చు కదా, అలా అయినా ప్రజలకు సేవ చేయొచ్చు కదా” అని సలహా ఇచ్చారట. దానికి రాశీ వెంటనే పాలిటిక్స్ తన వల్ల కాదని చెప్పినట్లు చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..