ఏపీ సీఎం జగన్ నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారులకు నేరుగా వారి అకౌంట్లలో నగదు జమచేశారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల ఇచ్చి వారికి అండగా నిలిచారు. అయితే ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. నవ రత్నాల లబ్ధిదారులు కూడా రాక్షస మనస్తత్వంతో చంద్రబాబు వెంట వెళుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాపై చంద్రబాబు అనవసర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. అంతేకాకుండా అఖండ, పుష్ప, బంగార్రాజు లాంటి సినిమాలు…
పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుతమైన డైలాగ్స్, స్క్రీన్ ప్లే, తారాగణం, మ్యూజిక్ తో కోసం అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే తాజాగా నాగ బాబు ‘భీమ్లా నాయక్’ను ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్‌లో సినిమా సమస్యలు, ప్రస్తుతం పరిస్థితుల గురించి ప్రస్తావించారు. సినిమా ఎలా పని చేస్తుందో, దాని కార్యకలాపాలు ఎలా ఉంటాయో తెలియదని…
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ రాసిన స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తమన్ సంగీతం సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను చిత్రబృందం మొత్తం ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా పవన్…
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు”. ప్రస్తుతం పవన్, క్రిష్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే క్రిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. ఆ స్పెషల్ ఏంటంటే… సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫుల్ ఖుషీ అయిన పవన్ కళ్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొన్నటివరకు పవన్ పై దుమ్మెత్తిపోసిన పృథ్వీ తాజగా పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ భీమ్లా నాయక్ పై ప్రశంసలు కురిపించాడు. “భీమ్లా నాయక్ చిత్రాన్ని తాడేపల్లిలో చూశాను. అప్పుడెప్పుడో రామారావు గారు నటించిన అడవి రాముడు సినిమాకి ఇంత భారీగా జనాలు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పవన్ సినిమాకే ఇంత మంది…
సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగం పై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి అంటూ నటుడు ప్రకాష్ రాజ్ సూటిగా ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబడుతున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్స్ వద్ద తీవ్ర అడ్డంకి ఏర్పడింది. అంతకు ముందున్న రేట్లనే అమ్మాలని సినిమాపై ఆంక్షలు విధించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న…
మల్టీస్టారర్ సినిమా అంటే ఇద్దరు హీరోలు.. నటన పరంగా పోటాపోటీగా ఉంటుంది. ఒకరి నటన ఎక్కువ ఒకరి నటన తక్కువ అని చెప్పలేము. అయితే అందులో పాత్రను బట్టి ఎవరు డామినేట్ చేశారు అనేది చెప్పొచ్చు. తాజగా భీమ్లా నాయక్ లో పవన్, రాం తన గురించి సినీ అభిమానులు ఇదే అంశంపై చర్చ సాగిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్ర కన్నా రానా పాత్ర డామినేట్ చేసింది అనేది కొంతమంది మాట. నిజం చెప్పాలంటే భీమ్లా…
టాలీవుడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవో వస్తుందని ఆశించిన ‘భీమ్లా నాయక్’ నిరాశే ఎదురయ్యింది. అంతేనా సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్ల వద్ద సీఆర్ఫీఎఫ్ జవాన్లు కన్పించడంపై చర్చ జరిగింది. కానీ ఏపీ మంత్రులు మాత్రం మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందని, కావాలంటే జీవో వచ్చేదాకా సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ సమర్థించుకుంటున్నారు.…
భీమ్లా నాయక్ సినిమాను సీఎం వైఎస్ జగన్ తొక్కేశారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడినాయన.. జగన్మోహన్ రెడ్డి శత్రువులు, మిత్రుల గురించి ఆలోచించరు.. ప్రజల గురించే ఆలోచిస్తారని తెలిపారు.. సినిమా పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబే కారణం అని ఆరోపించిన ఆయన.. కోర్టుకు వెళ్లి అడ్డగోలుగా ఆదేశాలు తెచ్చుకుని ప్రజలను దోచుకున్నా చంద్రబాబు.. గుడ్డివాడుగా వ్యవహరించాడని మండిపడ్డారు. ఇక, భీమ్లా నాయక్‌ను జగన్ తొక్కేశారు అనే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. Read Also : Surekha Konidala : సూపర్ స్టైలిష్…