హైదరాబాద్ లోని ధర్నా ఛౌక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్రంపై మండిపడ్డారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను ఏర్పాటు చేసిందని గుర్తు చేసారు. కళ్ళ ముందే బీజేపీ ఆస్తులను అమ్మేస్తుందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబం బతకాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.…
రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించుకున్న బీజేపీ.. విభజన చట్టంలోని హామీల్ని నెరవేరుస్తుందని భావిస్తే, దానికి బదులుగా తెలంగాణపై దండయాత్ర చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు, ఇచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అవమాన పరిచారన్నారు. అసలు బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందన్న విషయం.. ఈ సమావేశాలతో తేలిందన్నారు. ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం మోసం చేస్తోందని…
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. అయితే.. కార్యకర్తలలో భరోసా.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. టీఆర్ఎస్తో పొత్తు ఉండదని పార్టీ సీనియర్ నేతల రాహుల్ స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. పొత్తుల విషయం మాట్లాడవద్దని రాహుల్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇక పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్ సూచించారన్నారు. అయితే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని మల్లు రవి పేర్కొన్నారు.…