Telangana Assembly Sessions: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఇక ఐదు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చ జరగనుంది. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉభయసభల వేదికగా ఇవాళ మరోమారు తన వైఖరిని మరింత గట్టిగా స్పష్టం చేయనుంది.
read also: Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపై మాట్లాడండి.. భట్టి పై స్పీకర్ సీరియస్
అసెంబ్లీలో నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బయ్యారం ప్రాజెక్ట్ రాలేదు ఇస్తా అని కలెక్టర్ కి చెప్పాలని అన్నారు. Itir రాలేదా… అమలు చేస్తామని చెప్పాలన్నారు. బియ్యంకి కేంద్రం ఎంత ఇస్తుందో తెలుసా అని కలెక్టర్ నీ అడిగితే ఏం చెప్తారని ప్రశ్నించారు. దేశాన్ని అమ్మకానికి పెట్టింది బీజేపీ అని అన్నారు. మీటర్ లు పెట్టే విధానంకి వ్యతిరేకించాలని అన్నారు. గతంలోనే తీర్మానం చేశామని, కేంద్రం ఏ తీర్మానం ఏం చేసిందని అన్నారు. కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో కటాఫ్ sc లకు 60 ఉంచారని మండిపడ్డారు. మిగిలిన వర్గాలకు 20 శాతం తగ్గించారని, Sc లకు కూడా అలాగే తగ్గించండని కోరారు. Vra ల సమస్య పరిష్కారం చేయండని అన్నారు. హాస్టళ్ల లో విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారని, ఎమ్మెల్యే లను విజీట్ చేయించి చర్యలు తీసుకోవాలని.. ఈవిషయం పై సీఎం చొరవ తీసుకోవాలని అన్నారు. అయితే దీనిపై భట్టి నీ కేటాయించిన అంశం పైనే మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు. ఈవిషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. . విద్యుత్ చట్టం కూడా ముఖ్యమే అనీ, కానీ మిగిలిన అంశాలపై కూడా చర్చ చేయాలని అన్నారు. విద్యార్దులు… పోలీస్ రిక్రూటీమెంట్ లపై చర్చ చేద్దామన్నారు. అయితే దీనిపై అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. Bac లో నిర్ణయం మేరకే చర్చ జరుగుతుందని, భట్టి ఇవాళ్టి అంశం పైనే మాట్లాడమని చెప్పండని తెలిపారు. భట్టి వేరే అంశాలు మాట్లాడితే రికార్డ్ నుండి తొలగించండని పేర్కొన్నారు. ప్రజల సమస్యల చర్చకు వేరే వేదిక లేదని, సడన్ గా ప్రశ్నోత్తరాలు బంద్ చేశారు. రాత్రి 8.30 వరకు బిజినెస్ ఎంటో చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వండని ఆయన కోరారు.
Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపై మాట్లాడండి.. భట్టి పై స్పీకర్ సీరియస్