Bhatti Vikramarka: గాంధీజీ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మార్గం ప్రపంచ మానవాళికి దిశానిర్దేశమన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక రకాల అశాంతి, విభజన చోటు చేసుకుంటుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విభజన పెరిగిందన్నారు. ఒకరిద్దరి దగ్గరే దేశ ఆర్థిక సంపద అంతా ఉందని ఆయన ఆరోపించారు. హిందూ ముస్లిం భాయి భాయి అనే స్లోగన్‌తో అందరిని గాంధీ ఏకతాటిపైకి తెచ్చారన్నారు. గాంధీ ఆలోచన పాలనా విధానం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
ఓ వైపు జాతి పిత అంటూనే.. ఆయన ఆలోచనకు భిన్నంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. మతాలను రాజకీయాల్లోకి చొప్పించకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గాంధీ అడుగు జాడల్లో భాగంగానే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోందన్నారు. గాంధీ విధానమే రాష్ట్ర విధానం ఐతే.. హైదరాబాద్‌లో స్వచ్ఛతా లేకుండా పోయిందన్నారు. నగరంలో అన్ని బస్తీలలో విద్య, వైద్యం సక్రమంగా అందించాలన్నారు. నగరంలోని బస్తీలలో పర్యటించాలని సీఎల్పీ నిర్ణయించిందని.. బస్తీ పర్యటన చేసి సమస్యలు వెలుగులోకి తెస్తామన్నారు.
Kishan Reddy: ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా?.. ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి ఆగ్రహం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మల్లికార్జున ఖర్గే అపారమైన అనుభవం కలిగిన నాయకుడని.. ఓటమి ఎరుగని నేతని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారని.. అలాంటి వ్యక్తి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడాన్ని హర్షిస్తున్నామన్నారు. శశిథరూర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. బీజేపీ మీడియా ఖర్గేపై పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. విషపూరిత ఆలోచనతో బురద జల్లడం మానుకోవాలన్నారు. కులానికి మాత్రమే పరిమితం చేయకండంటూ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కొత్త పార్టీ ఇంకా ఊహాజనీతమని.. ప్రకటిస్తే తప్పితే తెలియదు అంటూ భట్టి విక్రమార్క అన్నారు. ఎవరు ఏం కొన్నారనేది వ్యక్తిగత అంశమన్నారు.