Jairam Ramesh: తెలంగాణలో కొత్త నినాదం తేవాలని, ఆపరేషన్ లోటస్ ఛోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. అందరి అభిప్రాయాలు చెప్పుకొనే వేసులు బాటు ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చరని, కానీ లక్ష్మణ రేఖ వుంటుందని తెలిపారు. గీత దాటితే నోటీసు ఇస్తుందని, రిప్లై వచ్చిన తరువాత చర్యలు ఉంటాయని తెలిపారు. కొన్ని రోజుకు వైట్ చేయండి… పాదయాత్ర ఎంపీ ..ఉప ఎన్నికల కంటే పెద్దదని జయరాం తెలిపారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే నాణెంకి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు అని తెలిపారు. 8 వ నిజాం ఇప్పుడు తెలంగాణలో పాలిస్తున్నరని అన్నారు. ఢిల్లీలో సుల్తాన్ పాలన జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో ఒంటరిగానే అధికారం లోకి వస్తుందని జైరాం రమేష్ అన్నారు.
Read also: Jairam Ramesh: మోడీ పాలసీలు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయి
భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండో రోజు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందని, కాంగ్రెస్‌కు భారత్ జూడో యాత్ర సంజీవని అని ప్రజలు అంటున్నారని అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర14 కి.మీ పూర్తి అయ్యిందని, 1/3 జూడో యాత్ర పూర్తి అయిందని తెలిపారు. ఇంకో 11 రోజుల తెలంగాణలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నవంబర్ 4న పాదయాత్రకు బ్రేక్ వుంటుందని, అక్టోబర్ 31న శంషాబాద్ లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. మోడీ పాలసీ లు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయని అన్నారు. ఆర్థిక అసమతుల్యత పెరిగిందని తెలిపారు. దేశం పేదరికంలోకి వెళ్తుందని అన్నారు.
Vishnu Vardhan Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ డ్రామా..! ఇది పీకే కుట్ర..