హైదరాబాద్ లోని ధర్నా ఛౌక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్రంపై మండిపడ్డారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను ఏర్పాటు చేసిందని గుర్తు చేసారు. కళ్ళ ముందే బీజేపీ ఆస్తులను అమ్మేస్తుందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబం బతకాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.…
రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.