రాష్ట్రంలో పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. పేదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను ఈ సర్కార్ దోపిడి చేస్తుందని ఆయ విమర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇండ్లు ఇవ్వకపోగా, గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి లాక్కుంటున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యహింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నామని భట్టి అన్నారు.
Also Read : Custody: రిలీజ్ కి ముందే సీక్వెల్ కి సన్నాహాలు…
రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాటి చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున రాజ్య హింస భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్దంగా, మౌనంగా, కనిపించకుండా ప్రభుత్వం రాజ్య హింస చేస్తున్నది అని మండిపడ్డారు.
Also Read : Hyderabad : హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు
హైదరాబాద్ చుట్టూ 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ప్రభుత్వం గుంజుకున్నది ఇది పేదల పట్ల జరుగుతున్న అతిపెద్ద కుట్ర అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. పేదల దగ్గర నుంచి గుంజుకున్నా భూములను సంపన్న వర్గాలకు కంపెనీలకు, హెచ్ఎండీఏ లేఔట్లు చేయడానికి కేటాయించడం దుర్మార్గం అన్నారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. మీకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి సమాయత్తం కండి. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read : Adipurush: టీజర్ లో ట్రోల్ చేశారని.. అతడిని ట్రైలర్ లో లేపేశారా..?
ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన హక్కులను కాలరాయడం దుర్మార్గం అని భట్టి విక్రమార్క అన్నారు. మహేశ్వరం మండలంలో ఫార్మాసిటీ కంపెనీ కోసం 500 ఎకరాలను లాక్కోవడంతో పాటు మరో 400 ఎకరాలను బఫర్ జోన్లో పెట్టిన ప్రభుత్వం.. వెయ్యి ఎకరాలు తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 2023- 24లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు మీ భూములు దోపిడీ కాకుండా మీరే కాపాడుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం, న్యాయస్థానాలు, మీడియా, సామాజిక బాధ్యత ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ దోపిడీకి వ్యక్తిరేకంగా ప్రజలకు అండగా ఉండాలి అని భట్టి విక్రమార్క కోరారు.