యాదాద్రి జిల్లా భువనగిరిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా.. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని లాక్కోవడం దురదృష్టకరమన్నారు. అంతేకాకుండా.. ధరణి మూలంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని, ధరణి రావడంతో ప్రజలు కోల్పోయిన హక్కులను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు భట్టి విక్రమార్క. ధనిక రాష్ర్టంలో రైతులకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని, పాదయాత్రలో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి తమ కష్టాలను, ఇబ్బందులను ఎకరువు పెడుతున్నారు.
Also Read : Ladies Romance: బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు.. అబ్బాయిలకు మించి రొమాన్స్
నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత నయీమ్ డైరీ ఏమైంది, స్వాధీనం చేసుకున్న అస్తులు, డబ్బు, ఆభరణాలు, భూమి పత్రాలు ఎక్కడికి పోయాయో ప్రభుత్వము ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నయీమ్ వ్యవహారంలో బీఅర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు.. ఆ గ్యాంగ్ స్టర్ కు.. ఈ గ్యాంగ్ స్టర్ లకు తేడా ఏముందని ఆయన మండిపడ్డారు. సంపద ప్రజలకు పంచడానికి తెలంగాణా తెచ్చుకున్నామని, ప్రజలంతా కష్టాలలో ఉంటే కేసిఆర్ మాత్రం ప్రగతి భవన్, సెక్రటేరియట్ లో నిర్మించుకొని.. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా… దేశంలో జరిగే ఎన్నికలకు తానే ఖర్చు పెట్టుకునే స్థాయికి ఎదిగాడు కేసిఆర్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేసిఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ హయాంలో ప్రారంభించి 90శాతం పూర్తి చేసినవే అని ఆయన అన్నారు.
Also Read : Rat : ఎంత పని చేశావే ఎలుక.. నీ వల్ల రూ.67వేలు లాస్