పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలోకి భట్టి విక్రమార్క చేపట్టిన హత్ సే హత్ జోడో యాత్ర చేరుకుంది. ఈ పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మానిక్ రావు థాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్దాల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రం ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే.. మా ఉద్యోగాలు వస్తాయనుకుంటే దశాబ్ద కాలంగా మోసం చేస్తున్నారని, ఒక్కగానొక్క నోటిఫికేషన్ వేస్తే.. పేపర్ లీకేజ్ తో మోసం చేశారన్నారు. అంతేకాకుండా. ‘నిరుద్యోగులకు భరోసా కల్పించడం కోసం రేపు సభ నిర్వహిస్తున్నాం. ప్రియాంక గాంధీ రేపు యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఈ డిక్లరేషన్ ను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం. రేపటి సభకు నిరుద్యోగ యువత తరలిరావాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో పేదలకు పంచిన భూములను 10 వేల ఎకరాలను లాక్కుంది. 5 లక్షల కోట్ల విలువైన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంది. కాంగ్రెస్ పేదలకు పంచిన భూములు పేదలకే ఉంచాలి. పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తిరిగి పేదలకు అధికారికంగా పట్టాలు ఇస్తాం.’ అన ఆయన హామీ ఇచ్చారు.
Also Read : GT vs LSG: గుజరాత్ టైటాన్స్ తాండవం.. లక్నో ముందు భారీ లక్ష్యం
అనంతరం తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. రేపు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హైదరాబాద్ వస్తున్నారని, తెలంగాణ లో తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ పేపర్లు లీక్ చేస్తోందని, నిరుద్యోగులకు, యువతకు భరోసా కల్పించేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారన్నారు. యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని, కాంగ్రెస్ హామీ ఇస్తే నెరవేరుస్తుంది.. చత్తీస్ గఢ్ , రాజస్థాన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. రేపు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : Islamabad Meeting: ఇస్లామాబాద్ సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం