సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 88వ రోజు ప్రారంభమైంది. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి చేరుకొనుంది. రెండు రోజుల పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగనుంది.
Read Also : Jharkhand : చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. చిన్నారిని మంటలో పడేసిన ఆస్పత్రి సిబ్బంది
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. గుర్రంపోడు మండలం పాల్వాయి శివారులోని లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలను సీఎల్పీ నేత కలిశారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి కష్టాలను, ఇబ్బందులను భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులో బస్తాలు ఎత్తేందుకు వాడే కొండి అనే పరికరాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందని రైస్ మిల్లు కూలీలు సీఎల్పీ నేతకు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాలాంటి వారికి ఉయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు కోరారు.
Read Also : Telangana 2k run: తెలంగాణ వ్యాప్తంగా 2కే రన్.. పోలీస్ శాఖ అధ్వర్యంలో కార్యక్రమం
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. తప్పకుండా అన్ని వర్గాలకు తాము అండగా ఉంటామని ఆయన హామి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు వల్లే అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజా పాలనను అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.