Botsa Satyanarayana: వాకౌట్ చేయటం మాకేం ఫ్యాషన్ కాదు.. టీడీపీలో మార్పు వస్తుందనే ప్రయత్నం!
- మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్
- వాకౌట్ చేయటం మాకేం ఫ్యాషన్ కాదు
- టీడీపీలో మార్పు వస్తుందనే మా ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం అసత్యాలు మాట్లాడుతుందంటూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తమకు వాకౌట్ చేయటం ఫ్యాషన్ అని కొందరు మాట్లాడుతున్నారని.. అది ఫ్యాషన్ కాదని, అలా చేస్తే అయినా కూటమి ప్రభుత్వంలో మార్పు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. తాము సమాధానాలు చెప్తే వినాలని.. అవాస్తవాలు మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రశ్నకి వైసీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు.
మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ… ‘రూ.8500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయి. ఇప్పటికి కేవలం రూ.700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ.7800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించారు. కూటమి ప్రభుత్వం 8 విడతల బకాయి పెట్టింది’ అని అన్నారు. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ…’అసలు మేం బకాయిలు పెట్టలేదని వైసీపీ సభ్యులు అవాస్తవాలు చెప్తున్నారు. ఏ క్వార్టర్ కు ఆ క్వార్టర్ చెల్లింపులు చేశామనడం అవాస్తవం. ఇప్పటి వరకు రూ.1859 కోట్లు చెల్లించాం. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల బకాయిలు పూర్తిగా చెల్లించాం. కాలేజీలకు ఇప్పటికే చెల్లింపులు చేసిన విద్యార్ధులకు వారి ఖాతాల్లోకి నగదు వేస్తాం. గతంలో కొన్ని తప్పుడు విధానాల్లో అప్పటి ప్రభుత్వం చెల్లింపులు చేసింది. అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్తున్నాం’ అని చెప్పారు.
Also Read
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
Also Read: Team India History: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చరిత్రాత్మక రికార్డు!
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘గత ప్రభుత్వ హయాంలో నాలుగు వేల కోట్లు బకాయి ఉందని చెప్పటం అవాస్తవం. ఎన్నికల కోడ్ రావటంతో ఒక్క క్వార్టర్ మాత్రమే బాకాయి పెట్టాం. అది కూడా అప్పటి ప్రతిపక్షం ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయటం వల్ల మాత్రమే పెండింగ్ పెట్టాల్సి వచ్చింది. అసలు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న బకాయిలు ఎప్పటిలోపు చెల్లిస్తారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘విపక్షనేత బొత్స గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేవని చెప్పిన దానిలో నిజం లేదు. మేము అన్నీ రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నాం. విద్యాశాఖ మంత్రిగా వాస్తవాలు చెప్పే హక్కు మాకుంది. గత ప్రభుత్వం 4064.59 కోట్లు బకాయలు పెట్టి వెళ్ళింది. నేను మాట్లాడిన దానికి అన్నీ ఆధారాలు సభ ముందు ఉంచుతాం’ అని అన్నారు.
తాజావార్తలు
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!