Bhatti Vikramarka: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేపట్టిన ఆయన.. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటేశారు.. వాన, ఎండ అనే తేడా లేకుండా వడివడిగా అడుగులు వేస్తున్నారు.. అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపుతున్నారు.. ఇక, తన పాదయాత్రలో సందర్భంగా ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు.. అది కూడా ఒకే సారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు..
Read Also: Tata: టాటా కంపెనీ సీఈఓల వార్షిక వేతనం ఎంతో తెలుసా..? షాక్ అవ్వడం ఖాయం..
మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు భట్టి విక్రమార్క.. పీఎం, సీఎం కలిసి.. గ్యాస్ ధర రూ.1100 దాటించారని విమర్శలు గుప్పించిన ఆయన.. మేం అధికారం చేపడితే.. పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు.. ఇక, రేషన్ కార్డుపై బియ్యంతో పాటు.. ఉప్పు, పప్పు, చక్కర, నూనె, సబ్బులు.. ఇలా తొమ్మిది రకాల వస్తువులను అందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదలకు న్యాయం జరుగుతుంది.. అధికార పార్టీ పెండింగ్‌లో పెట్టిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..