Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 85వ రోజు నేడు నల్గొండ జిల్లా చందంపేట మండలం మురుపునూతల గ్రామం పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ మహిళా కూలీల వద్దకు వెళ్లి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిండి మండలం బోయినపల్లి గ్రామం నుంచి పత్తి విత్తనాలు నాటడానికి అచ్చంపేట మండలం మురిపి నూతల ఊరికి వచ్చామని వ్యవసాయ కూలీలు చెప్పారు. సీఎం కేసీఆర్ ఇల్లు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామని చెప్తున్నారు మీకు వచ్చాయా? అని భట్టి విక్రమార్క వారిని అడిగినప్పుడు మా ఊర్లో ఒకరి కూడా ఇల్లు రాలేదని మహిళలు కడారి భాగ్యమ్మ, జంగమ్మ నడింపల్లి, ఈశ్వరమ్మ, రాములమ్మ, సంతోష, కృష్ణమ్మలు, చెప్పారు. శివర్ల జంగమ్మ, కడారి భాగ్యమ్మ మాట్లాడుతూ తన భర్తకు 64 సంవత్సరాలు వచ్చిన ఇప్పటి వరకు పించను ఈ ప్రభుత్వ ఇవ్వడం లేదని చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్న ఎవరు పట్టించుకోవడంలేదని చెప్పింది. బద్దెల యాదమ్మ మాట్లాడుతూ చనిపోయిన తర్వాత నాలుగైదు సార్లు తాహాసిల్దార్ కార్యాలయం వెళ్లి దరఖాస్తు చేసుకున్న వితంతు పెన్షన్ మంజూరు కాలేదని మీరైనా ఇప్పించాలని వేడుకొంది.
Read also: Varuntej: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కు రానున్న సెలబ్రేటీ లు ఎవరో తెలుసా..?
సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తాడని చెప్పడంతో బ్యాంకు నుంచి 80 వేల రూపాయలు తీసుకున్న అప్పు నాలుగేళ్లుగా కట్టకపోవడంతో వడ్డీతో కలిపి బాకీ రెండు లక్షల రూపాయలు అయ్యింది. పెట్టుబడి కోసం బ్యాంక్ కు వెళ్తే పాత బాకీ కడితే డబ్బులు ఇస్తామని చెప్పారు. దీంతో సావుకారు దగ్గరికి వెళ్లి ఐదు రూపాయలు వడ్డీ లెక్క పెట్టుబడి తెచ్చుకున్నాము. సంఘాలకు పావలా వడ్డీ కూడా రావట్లేదు. ఇంత కష్టపడి పిల్లల్ని చదివిస్తే నా ఇద్దరు పిల్లలకు ఎలాంటి కొలువులు రాకపోవడంతో హైదరాబాదులో షాపులలో పనిచేస్తున్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని అంటే కొట్లాడి తెచ్చుకుంటే మా బతుకులలో ఏలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మాకు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు తప్ప మళ్ళీ కొత్తగా ఇల్లు రాలేదు. నాకే కాదు. ఊర్లో కూడా ఎవరికి కొత్తగా ఇల్లు రాలేదు. మీరు చెప్పినట్టుగా ఇందిరమ్మ రాజ్యం రావడానికి కాంగ్రెస్కు ఓటేస్తాం. మాకు ఇల్లు వచ్చేలా, రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరింది. నేను చెప్పినవన్నీ కూడా విన్నాను మీ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నాలుగు నెలలు ఆగండి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మీకు ఇండ్లు రుణమాఫీ పింఛన్లు పావలా వడ్డీ రుణాలు తప్పనిసరిగా ఇచ్చి ఆదుకుంటామని ఆ మహిళా కూలీలకు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.
Odisha Train Accident: స్కూల్లో 250 శవాలు.. వెళ్లాలంటే భయపడుతున్న టీచర్లు, స్టూడెంట్స్