నల్లగొండ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. దేవరకొండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, అందరి సహకారం వల్లే వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశానన్నారు. నాపాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారని, 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే సాగు నీళ్లు ఇస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుందన్నారు. నల్లగొండ జిల్లాకు అతి ఎక్కువ నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీని.. నల్లగొండ జిల్లాకు చేసిన అన్యాయంపై క్షమాపణైనా చెప్పండి లేదా బహిరంగ చర్చకైనా రండి అని ఆయన సవాల్ చేశారు.
Also Read : Amit Shah: ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. వైజాగ్ లో అమిత్ షా పర్యటన..
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చకు రావడానికి, సవాల్ స్వీకరించడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారా. ధనిక రాష్ట్రం, సంపన్న రాష్ట్రం రేషన్ షాప్ లో ఇవ్వాల్సిన నిత్యవసర సరుకులు ఎందుకు ఇవ్వలేక పోతుంది. మీరు ప్రారంభించిన థర్మల్ పవర్ ప్లాంట్ లు ప్రారంభించకుండానే 24 గంటల విద్యుత్ ఎలా ఇస్తున్నారో చెప్పాలి. బీఆర్ఎస్ మాయమాటలు గుర్తించిన దేవరకొండ ప్రజలు పీపుల్స్ మర్చ్ కు బ్రహ్మరథం పట్టారు. 2023లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబల్ బెడ్ రూమ్ లకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. 500 రూపాయలకే కే సిలిండర్లు ఇస్తాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం.
భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి ₹12 వేల రూపాయలు ఇస్తాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చేసేదే చెప్తాం.. చెప్పిందే చేస్తాం.. మాయమాటలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు.’ అని భట్టి వ్యాఖ్యానించారు.