Swati Maliwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై శీష్ మహల్2.0 ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ముందు ఆయన విలాసవంతమైన భవనం వివాదంగా మారింది. అయితే, ఇప్పుడు ఛండీగఢ్‌లో కూడా ఇలాంటి భవనాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రధాని మోడీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించి వచ్చారు. మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు.
ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం ఘనంగా నిర్వహించారు. కూతురు ఇష్టపడిన ప్రియుడు సంభవ్ జైన్‌తో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుక ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా, చాలా మంది ప్రముఖులు, ఆప్ నేతలు హాజయ్యారు.
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
Punjab: శుక్రవారం అర్థరాత్రి పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ దేవాలయంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిటికీ అద్ధాలు, గోడలు దెబ్బతిన్నాయి. ఖాండ్‌వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌ప వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలు విసిరి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.
Punjab: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు.
AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ని మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ ఊహాగానాలపై మాన్ నవ్వుతూ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో జరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ వేడిని పుట్టించింది.
Ambedkar Statue : దేశమంతా గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుండగా అమృత్‌సర్‌లో కొంతమంది వ్యక్తులు టౌన్ హాల్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీపై ఇప్పటివరకు 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఢిల్లీలోని నార్త్ వెన్యూ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి.