Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఈ రోజు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ని కలుసుకున్నారు. కేజ్రీవాల్‌ని జైలులో ఉగ్రవాదిలా చూస్తున్నారని అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుటుంబం (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుటుంబం (Punjab CM Bhagwant Mann) ఆయోధ్యలో (Ayodhya) పర్యటించారు.
పంజాబ్ లో పరిశ్రమ, వాణిజ్యాన్ని విస్తరించడానికి కృషి చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచం పురోగమిస్తోంది కానీ.. పంజాబ్ ఇప్పటికి వెనుకపడి ఉంది. ఇప్పుడు మనం దానిని మార్చాలన్నారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన ఐదేళ్లలోపు దీని సంఖ్యను 2 వేల యూనిట్లకు పెంచుతామన్నారు.
కొంతకాలంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు ముదిరింది. ముఖ్యమంత్రికి గవర్నర్ శుక్రవారం గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ముమ్మరం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యకతిరేకంగా దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహిస్తుంది.
మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు క్రికెటర్ జాస్ ఇందర్ సింగ్ నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు.