AAP: పంజాబ్ సీఎంని మార్చనున్న ఆప్..? భగవంత్ మాన్ ఏం చెప్పారంటే..
- ఢిల్లీ ఓటమితో పంజాబ్‌పై ప్రభావం..
- ఆప్‌లో రాజకీయ సంక్షోభం..
- సీఎం మార్పుపై స్పందించిన భగవంత్ మాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ని మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ ఊహాగానాలపై మాన్ నవ్వుతూ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో జరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ వేడిని పుట్టించింది.
మాన్‌ని సీఎంగా తొలగించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడంటూ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రాజౌరి గార్డెన్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. భగవంత్ మాన్ సరిగా పనిచేయడం లేదనే ముద్ర వేయడ ద్వారా ఆయనను తొలగిచే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వైఫల్యాలకు మాన్‌ని బాధ్యుడిని చేసి, కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనునకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Bird Flu Effect: చికెన్ ప్రియులకు పండగే.. కిలో రూ. 30 మాత్రమే!
అయితే, దీనిపై భగవంత్ మాన్ స్పందిస్తూ.. నవ్వుతూ ‘‘వాళ్లు చెప్పనివ్వండి’’ అని అన్నారు. పంజాబ్‌లోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దాదాపు మూడేళ్లుగా ప్రతాప్ బజ్వా ఇదే మాట చెబుతున్నారని, ఢిల్లీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను మూడో సారి లెక్కించండి అంటూ ఎద్దేవా చేశారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా స్థానాలు సాధించిందని భగవంత్ మాన్ ఎగతాళి చేశారు.
మేము మా పార్టీని మా రక్తం, చెమటతో నిర్మించామని, నిజానికి కాంగ్రెస్ వారికి మాత్రమే పార్టీలు మారే సంస్కృతి ఉందని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీలో 117 మంది సభ్యులు ఉంటే ఆప్ కి 93 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు బాగా పనిచేశారని మాన్ అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!