ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో సమావేశం కానున్నారు.
ఒక నెలపాటు సుదీర్ఘమైన వేట తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మార్చి 18న రాష్ట్రం అమృతపాల్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని, అయితే రక్తపాతాన్ని నివారించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. మార్చి 18న పంజాబ్ పోలీసులు ఖలిస్తానీ వేర్పాటువాది, అతని సహాయకులపై అణిచివేత ప్రారంభించారు.
వేర్పాటువాద బోధకుడు అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసుల చర్యలపై కొంత మంది సిక్కు పెద్దలు మండిపడుతున్నారు. అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసుల అణిచివేతపై భగవంత్ మాన్ ప్రభుత్వానికి, కేంద్రానికి వ్యతిరేకంగా అకల్ తఖ్త్ ఒక బలమైన ప్రకటనను విడుదల చేసింది.
పంజాబ్‌లో తుపాకీ సంస్కృతిపై అణిచివేత కొనసాగిస్తూ భగవంత్-మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం 813 ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేసింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు 2,000 పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది.
Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు, డ్రగ్స్ అక్రమరవాణాపై చర్చించారు. డ్రగ్స్ మాఫియాకు పాకిస్తాన్ రక్షణ ఇస్తోందని భగవంత్ మన్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నివాసంలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది.
వృత్తిపరమైన శిక్షణ కోసం స్కూల్ ప్రిన్సిపాల్స్‌ను సింగపూర్ పంపించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం 36 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సింగపూర్ పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు.
Water Tax: రాజులు, బ్రిటీషర్ల కాలంలో విచిత్రమైన పన్నులు ఉండేవని విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం కానీ.. ప్రస్తుతం మళ్లీ అలాంటి రోజులే రాబోతున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
Kanti velugu second phase: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు.
లక్షీనరసింహ ఆలయానికి దర్శించుకునేందుకు నలుగురు సీఎంలు యాదాద్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు.