దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మార్పు కనిపించడం లేదు. చట్టాలకు భయపడకుండా ఘాతుకాలకు తెగబడుతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కూతురు పెళ్లి కోసం దాచి పెట్టిన బంగారు నగలు దోచుకెళ్లారు.
ఇది కూడా చదవండి: TDP Mahanadu: రేపటి నుంచి మహానాడు… పసుపు పండుగకు కడప ముస్తాబు..
లత, ప్రకాష్ భార్యాభర్తలు. సెంట్రల్ బెంగళూరులోని కాటన్‌పేట్‌లోని అద్దె ఇంట్లో ఉంటారు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. లత (40) గృహణి. భర్త ప్రకాష్ బెంగళూరులో హోల్‌సేల్ బట్టల వ్యాపారి. భార్య హత్య సమయంలో దుకాణంలో ఉన్నాడు. కుమార్తె ప్రైవేట్ ఉద్యోగంలో ఉంది. కుమారుడు పాఠశాలకు వెళ్లాడు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ ర్యాలీకి హాజరైన కల్నల్ సోఫియా ఖురేషి ఫ్యామిలీ.. ప్రధాని ట్వీట్
ఇంట్లో ఒంటరిగా ఉన్న లతను ఎవరో టార్గెట్ చేసి మాటు వేశారు. అప్పటికే కుమార్తె పెళ్లి కోసం రూ.20లక్షల ఖరీదైన నగలు కొని ఇంట్లో పెట్టారు. అయితే దుండగులు ఇంట్లోకి ప్రవేశించి లతను అత్యంత దారుణంగా హతమార్చి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం భోజనం కోసం ప్రకాష్ ఇంటికి వచ్చేటప్పటికీ భార్య శవమై కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లో నగదు, నగలు పోయినట్లుగా ఫిర్యాదు చేశాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. లతను తెలిసిన వ్యక్తులే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నగలు, నగదు దోచుకునే ముందు లత గొంతు కోసి చంపేశారని పేర్కొన్నారు. కచ్చితంగా తెలిసిన వాళ్ల పనేనని అనుమానిస్తున్నారు. కుమార్తె పెళ్లి కోసం ఇంట్లో నగలు, నగదు ఉన్నట్లు బంధువులకే తెలుసని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరిచయం ఉన్న కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.