Opposition Meeting: గత నెలలో పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల భేటీ జరిగింది. ముందుగా సిమ్లా వేదిక రెండోసారి ప్రతిపక్షాలు భేటీ కావాలని అనుకున్నాయి. అయితే ఈ వేదికను బెంగళూర్ కి మార్చారు. ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూర్ వేదికగా రెండోసారి విపక్షాల భేటీ జరగబోతోంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో పాటు జనాలకు వణుకు పుట్టించేలా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి..ఈ రోజు ధర రేపు ఉంటుందా అనేటంతగా ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఏమి కొనేటట్లు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని రోజూవారి కూలీలకు పెను భారంగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా దేశంలో ఇక్కడ అక్కడ అని లేకుండా టమాటా ధర పెట్రోల్ ధర కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో టమాటా ధర…
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య విపక్షాల రెండో సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
Opposition Meeting: విపక్షాల ఐక్యతపై ఈ నెల 23న పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మొత్తం 17 పార్టీలు సమావేశమయ్యాయి.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కాంగ్రెస్ నేత కె.రమేష్ బాబు ఫిర్యాదు మేరకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతపై ఫిర్యాదు నమోదైంది.
Tomato Prices: దేశంలో టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో టమాటా ధరలు లేవు. ఇప్పటికే కిలో టమాటా రేటు రూ. 100ను దాటింది. ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీలతో పాటు ప్రధాన నగరాల్లో టమాటా కిలో ధర సెంచరీని చేరింది.
House sales: హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈ ఏడాది నివాస గృహాల విక్రయాల్లో 8-10 శాతం వృద్ధి నమోదు అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో దేశంలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు పెరుగుతాయని తెలిపింది. వసూల్లు బాగుండటంతో పాటు రుణభారం తక్కువగా ఉండటంతో డెవలపర్ల క్రిడెట్ ప్రొఫైల్ కూడా బలోపేతం అవుతాయని నివేదిక తెలిపింది.
Bengaluru: బెంగళూర్ లో అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో 25 మంది ఆఫ్రికా జాతీయులను అరెస్ట్ చేశారు.
Bengaluru: 8 ఏళ్ల వయసున్న బాలిక చెప్పిన అబద్ధం, తప్పుడు ఆరోపణ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ప్రాణాలు మీదికి తీసుకువచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ తనను బలవంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లాడని చెప్పడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, అపార్ట్మెమెంట్ లోని ప్రజలు చితకబాదారు. ఈ ఘటన బెంగళూర్ లోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. అయితే, బాలిక ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన…
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. వినూత్నంగా ఆలోచించి తన ఆటోని కారులా మార్చేశాడు. డబ్బులు ఖర్చు అయినా ఓకే కానీ.. అతని కలను నిజం చేసుకున్నాడు. అయితే ఆ ఆటో లోపల స్పెషల్ గా అచ్చం కారులా మెత్తటి సీట్లు, లైటింగ్, డోర్లు ఏర్పాటు చేయించాడు. బయటి నుంచి చూస్తే ఆటో మాదిరే ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే కారులో ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది.