Bengaluru Meeting: నేడు, రేపు బెంగళూరులో విపక్షాల సమావేశాలు… హాజరు కానున్న ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Meeting: 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఒకసారి భేటీ అయ్యాయి. అందులో భాగంగా నేడు, రేపు బెంగళూరులో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ సహా 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, స్టాలిన్, మమతాబెనర్జీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాలు ఏకం కావడంతో.. బీజేపీ కూడా తన స్పీడ్ పెంచింది. ఎన్‌డీఏ పక్ష మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేపు ఎన్‌డీఏ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌డీఏ పక్ష సమావేశానికి జనసేన పార్టీని కూడా ఆహ్వానించింది.
Read also: Somavathi Amavasya: సోమావతి అమావాస్య రోజు అభిషేకం వీక్షిస్తే పాపాలు తొలగిపోతాయి
Also Read
ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటుండగా.. నితీశ్‌కుమార్ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్ (డీఎంకే), హేమంత్‌సోరెన్ (జేఎంఎం), ఉద్ధవ్‌ఠాక్రే (ఎస్‌ఎస్–యుబీటీ), శరద్‌పవార్ (ఎన్‌సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), అఖిలేశ్‌యాదవ్ (ఎస్‌పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదితరులు పాల్గొంటారు. ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆప్.. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఆదివారం జరిగిన ఆప్ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!