Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది.
Bengaluru Rains: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు రోడ్లపైకి నీరు చేరింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ప్రభావం కారణంగా బెంగళూర్
Smoking Beedi On Flight: విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్న వ్యక్తి, నిబంధనలు తెలియక బీడీ తాగాడు. దీంతో అరెస్ట్ అయ్యాడు. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి మంగళవారం అహ్మదాబాద్‌లో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగా.. మరుగుదొడ్డికి వెళ్లిన అతను అక్కడ బీడీ తాగాడు.
Matrimonial frauds: ఇటీవల కాలంలో మ్యాట్రిమోని వెబ్సైట్ మోసాలు పెరిగిపోయాయి. తల్లిదండ్రుల అత్యాశ ఈ మోసాలకు కారణం అవుతోంది. ప్యాకేజీ, ఉద్యోగం, బంగ్లాలు, కార్లను చూసి మోసపోతున్నారు. తప్పుడు సమాచారంతో ముఖ్యంగా మహిళలను మోసం చేస్తున్నారు. చివరకు పెళ్లైన తర్వాత అసలు విషయం తెలియడమో.. లేకపోతే మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి నగదు, బంగారాన్ని కొట్టేస్తున్నారు. తా
Foxconn: తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ బెంగళూర్ శివారులో భారీ ధరతో భూమిని కొనుగోలు చేసింది. ఏకంగా 13 మిలియన్ డాలర్లను( సుమారు రూ.106 కోట్లు) వెచ్చించి నగర శివారులో భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఉత్పత్తిని విస్తరించాలని ఫాక్స్ కాన్ భావిస్తుంది. దీంతో ఈ సంస్థ భారత్ లో పెట్టుబడులు పెడుతోంది. ఫాక్స్‌కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, ఆపిల్ ఐఫోన్ల ప్రధాన అసెంబ్లర్.
శివాజీనగర్ నుంచి లింగరాజపురం వెళ్తున్న బీఎంటీసీ బస్సు రావడంతో టక్కున బస్సు ఎక్కి అందులో ఉన్న విద్యార్థులకు, ప్రయాణికులకు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. లింగరాజపురం బస్సులో ఉన్న విద్యార్థులు, మహిళలతో మాట్లాడుతూ చాలా దూరం ప్రయాణించి వారి సమస్యను తెలుసుకున్నారు.
PM Modi: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వరసగా రెండో రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రోజు శనివారం మూడు గంటల పాటు మోదీ రోడ్ షో జరిగింది. దాదాపుగా 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ శనివారం నగరంలో దాదాపు 26 కి.మీ రోడ్‌షో నిర్వహించిన ప్రధానిని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్డుకిరువైపుల…
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ ఇందులో పాల్గొననున్నారు.
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బాదుడు షుచూ చేసింది. వినియోగదారుల నుంచి ఫుడ్ ఆర్డర్ పై రుసుము వసూలు చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్ తో సంబంధం లేకుండా ‘‘ప్లాట్‌ఫారమ్’’ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలు పెరగడం అనేది ఉండదు.
విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఎడ్-టెక్ సంస్థ బైజూస్ ఎండీ, సీఈవో బైజు రవీంద్రన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సోదాలు నిర్వహించింది.