Mumbai Most Expensive Indian City For Expats: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది.
Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో డేటా సైన్స్ ప్రోగ్రామ్ కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యా రుణాలు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు తప్పుడు వాగ్దానాలు చేసి ఆ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ఆ సంస్థ సీఈవోపై ఆరోపణలు ఉన్నాయి.
Delhi: దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దవుతోంది. మంగళవారం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుతలో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలను దారి మళ్లించారు. మంగళవారం ఢిల్లీకి రావాల్సిన 10 విమానాల్లో 9 విమానాలను జైపూర్ కు, ఒకదాన్ని లక్నోకు దారి మళ్లించారు.
Amul: కర్ణాటక, తమిళనాడు తర్వాత ఇప్పుడు అమూల్ పాలపై పోరాటం మహారాష్ట్రకు చేరింది. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సంఘాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అమూల్‌కు వ్యతిరేకంగా నిలబడాలని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ విజ్ఞప్తి చేశారు.
బెంగళూరులో రుతుపవనాలకు ముందు వర్షాలు వినాశనం కలిగిస్తూనే ఉన్నాయి, ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 52 మరణాలు నమోదయ్యాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చెట్లు కూలడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోగా, పిడుగులు పడి కొందరు వర్షపు నీటిలో కొట్టుకుపోయి మరణించారు.
బెంగళూరులో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమాని తీవ్రంగా నష్టపోయాడు.
Bengaluru: బెంగళూర్ లో అధికారం వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరం మొత్తం భారీ వర్షం తడిసిముద్దైంది. పలు ప్రాంతాల్లో అండర్ పాసుల కిందికి నీళ్లు చేరాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ వర్షం వల్ల ఆంధ్రప్రదేశ్ కు చెంది టెకీ భానురేఖ మరణించారు.
Virat Kohli: బెంగళూరులో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు కోహ్లీ. 61 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి వరుసగా ఇది రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు విరాట్. IPLలో విరాట్ కోహ్లీకి ఇది ఏడో సెంచరీ. అంతేకాదు… IPL చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న…